విద్యార్థులకు అలర్ట్: కర్ణాటక ఎస్ఎస్ఎల్సీ, పీయూసీ పరీక్షల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: బెంగళూరు

కర్ణాటక స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ అసెస్మెంట్ బోర్డు పదో తరగతి ఎస్ఎస్ఎల్సీ అలాగే ద్వితీయ పీయూసీ పరీక్షల 2027 షెడ్యూల్ను విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు జరుగుతాయని, ఉదయం పూట సింగిల్ షిఫ్ట్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.