కూటమి అభ్యర్థుల భారీ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో కదలాలి
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండలంలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో పదకొండు ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసి స్థానంలో కూటమి విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.