ఫరీదాబాద్ లో అనధికారిక బుల్లెట్ ప్రూఫ్ వాహనాల తయారీ వర్క్ షాప్ పై దాడి

రిపోర్టర్: శివ స్థలం: Haryana

హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా తిగావ్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ఎస్‌యూవీ, ఎంయూవీ వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ మార్పులు చేస్తున్న వర్క్‌షాప్‌పై ముఖ్యమంత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ తనిఖీలలో రెండు టయోటా ఫార్చ్యూనర్లు, రెండు మహీంద్రా స్కార్పియో వాహనాలను స్వాధీనం చేసుకుని, వర్క్‌షాప్ నిర్వాహకుడు ప్రమోద్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.