నవీ ముంబైలో చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అఘాయిత్యం!
రిపోర్టర్: హరి
స్థలం: India
మహారాష్ట్రలోని నవీ ముంబైలో పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న మూడేళ్ల చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రూట్లో అందరూ దిగిపోయాక, చిన్నారి ఒక్కటే ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఈ దురాగ్యానికి ఒడిగట్టాడు. ఇంటికి వెళాక కడుపునొప్పితో బాధపడుతున్న చిన్నారి ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడిని అరెస్ట్ చేశారు.