అడవిపందిని వేటాడి చంపిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్.. మాంసంతో సహా పట్టుకున్న అటవీశాఖ అధికారులు!
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి రేంజ్ పరిధిలోని ధర్మారావుపేట సెక్షన్ బుగ్గగూడ గ్రామ సమీపంలో అడవిపందిని వేటాడి చంపిన ఘటనలో సంకుర్తల శ్రీకాంత్ పత్తిచేనులో మాంసంతో పట్టుబడ్డాడు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టగా నిందితుడు దొరికాడు. విచారణలో మాంసం కొనుగోలుకు వచ్చిన శ్రీనివాస్, రంజిత్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నేరాన్ని అంగీకరించడంతో సంబంధిత అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్ తెలిపారు.