జాతీయ సమైక్యతా దినోత్సవం: ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా పోలీస్ ర్యాలీ నిర్వహణ

రిపోర్టర్: గోపి స్థలం: ఎన్టీఆర్

జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా సమైక్యతా ర్యాలీ నిర్వహించినట్లు Vijayawada City Police వెల్లడించారు. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ ర్యాలీలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలతో పాటు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని దేశ సమగ్రతను చాటారు.