విజయదశమి వేడుకలు: కర్నూలు పోలీసు హెడ్క్వార్టర్స్లో ఘనంగా ఆయుధ పూజ

రిపోర్టర్: శివ స్థలం: కర్నూలు

కర్నూలు పోలీసు హెడ్క్వార్టర్స్లో విజయదశమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించినట్లు Kurnool Police వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ దంపతులు, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపీఎస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు, సిబ్బందికి, జిల్లా ప్రజలందరికీ వారు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భద్రతా నిబంధనలపై కీలక సూచనలు జేశారు.