జిల్లాలో భారీగా పడిపోయిన భూగర్భ జలమట్టాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎల్‌నినో ప్రభావంతో నిరుడితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలమట్టాలు భారీగా పడిపోయాయి. జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యధికంగా దుత్తలూరు, సీతారామపురం, మర్రిపాడు మండలాల్లో 15 మీటర్లకు పైగా పడిపోయింది. నీటిని పొదుపుగా వినియోగించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూగర్భజల వనరుల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.