ఆమనగల్ ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీలో ఘనంగా ఆయుర్వేద దినోత్సవం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీలో 11వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యతను వివరించారు. ఆయుర్వేదం ద్వారా ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు.