ముంబైలో విషాదం విద్యుత్ ఘాతంతో చిన్నారి మృతి

రిపోర్టర్: నరేష్ స్థలం: Mumbai, Maharashtra

మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. కాలాచౌకి మహా గణపతి పండాల్ సమీపంలో విద్యుత్ ప్రవహించడంతో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. రాత్రి రెండు గంటల సమయంలో క్యూలైన్లో నిలబడి ఉండగా ఈ ప్రమాదం సంభవించినట్లు మృతురాలి బంధువు కిస్మతి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ జనసందోహం మధ్య జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.