పదో తరగతి గణితం బేసిక్ శాంపిల్ పేపర్ విడుదల చేసిన సీబీఎస్‌ఈ
రిపోర్టర్: కిరణ్
స్థలం: న్యూఢిల్లీ
సీబీఎస్‌ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి మ్యాథమెటిక్స్ బేసిక్ శాంపిల్ క్వశ్చన్ పేపర్ మరియు మార్కింగ్ స్కీమ్‌ను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఈ నమూనా ప్రశ్నాపత్రం ద్వారా విద్యార్థులు పరీక్షా విధానం, మార్కుల వెయిటేజీని సులభంగా తెలుసుకోవచ్చని బోర్డు తెలిపింది.