యువతలో సేవాభావం పెంపొందించడానికి ఎన్ఎస్ఎస్ ఎంతగానో దోహదపడుతుందని ప్రిన్సిపాల్ వాణిశ్రీ వెల్లడి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాళహస్తి

యువతలో సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి జాతీయ సేవా పథకం ఎన్.ఎస్.ఎస్. ఉపయోగపడుతుందని డాక్టర్ ఆర్.బి. వాణిశ్రీ తెలిపారు. శ్రీకాళహస్తిలోని ఎస్.వి.ఏ. ప్రభుత్వ కళాశాలలో జాతీయ సేవా పథక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ వాణిశ్రీ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వల్ల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఆరోగ్య స్పృహ కలుగుతాయన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మన్యం నరసింహులు, ఎన్ఎస్ఎస్ అధికారి సుధీర్, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.