మున్సిపల్ ఎన్నికలు: సామాన్యులకు పీఠం కట్టబెట్టిన ఎన్డీఏ కూటమి

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్ లో ఎన్డీఏ కూటమి సరికొత్త చరిత్ర సృష్టించిందని, రాజకీయ నేపథ్యం లేని సామాన్యులకు పెద్దపీట వేసిందని విశ్లేషకులు తెలిపారు. ట్యాక్సీ డ్రైవర్, ల్యాబ్ టెక్నీషియన్ భార్య, నర్సు, గృహిణులు తదితర సాధారణ నేపథ్యం ఉన్నవారు పురపాలక ఛైర్మన్లు, ఛైర్పర్సన్లుగా ఎన్నికయ్యారని స్పష్టం చేశారు. కోట్ల రూపాయల ధనబలం, రాజకీయ వారసత్వం లేకపోయినా కేవలం ప్రజల ఆదరణతో వీరు ఉన్నత స్థానాలను దక్కించుకోవడం విశేషమని పేర్కొన్నారు.