భక్తిశ్రద్ధలతో ముగిసిన మనుబోలు చెర్లోపల్లి గణేశుని ప్రత్యేక పూజలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో పోలేరమ్మ గుడి వద్ద కొలువుదీరిన విజ్ఞేశ్వరునికి ఐదవ రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన మరియు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు యువతను ఎంతగానో ఉత్సాహపరిచాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా సాగిన ఈ వేడుకల పట్ల గ్రామ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.