ఆకట్టుకునేలా ‘హ్యాపీ జర్నీ’ సినిమా ట్రైలర్ విడుదల
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
భిన్న మనస్తత్వాలు కలిగిన ఏడుగురు మహిళలు యూరప్ ట్రిప్ నేపథ్యంలో సాగే విభిన్న కథాంశంతో వస్తున్న తాజా చిత్రం ‘హ్యాపీ జర్నీ’ ట్రైలర్ విడుదలైంది. అన్నపూర్ణ, ఆమని, జాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభీరామ్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచి వినోదం, సెంటిమెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి.