తెలంగాణలో కౌలు రైతులకు భరోసా: గుర్తింపు ప్రక్రియపై కేబినెట్ కసరత్తు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో 25 లక్షల మంది కౌలు రైతులను గుర్తించి, వారికి ప్రభుత్వ సాయం అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తోంది. పట్టాదారులకు ఇబ్బంది లేకుండా కౌలుదారులను గుర్తించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీ తరహాలో కొత్త చట్టం లేదా గుర్తింపు కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టి సారించింది. కౌలుదారుల ఉనికిని గత ప్రభుత్వం విస్మరించగా, ఇప్పుడు వారికి న్యాయం చేసేందుకు మార్గాలు అన్వేషిస్తోంది.