కోలీవుడ్ లో అజిత్ కొత్త సినిమా: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
రిపోర్టర్: సునీల్
స్థలం: Chennai
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం పూజా కార్యక్రమాలతో చెన్నైలో ఘనంగా ప్రారంభమైందని చిత్ర యూనిట్ తెలిపింది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి డేర్ డెవిల్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ పూజా కార్యక్రమంలో శ్రీలీల, ఉన్ని ముకుందన్, పార్తిబన్ తదితర నూతన తారాగణం పాల్గొంది. నటుడు అజిత్ దుబాయ్ లో ఉండటం వల్ల ఈ వేడుకకు హాజరు కాలేకపోయారని మేనేజర్ సురేష్ చంద్ర తెలిపారు.