పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో అత్యవసర పరిస్థితి విధింపు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఇస్లామాబాద్
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించిందని విశ్లేషకులు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పిటిఐ ప్రభుత్వాన్ని ఉగ్రవాద నియంత్రణలో విఫలమయ్యారనే కారణంతో రద్దు చేశారని పేర్కొన్నారు. ఈ పరిణామంతో రావల్పిండి సైనిక ప్రధాన కార్యాలయంపై తీవ్ర ప్రభావం పడుతుందని, సైనిక చీఫ్ ఆసిమ్ మునీర్ కొత్త రకం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు స్పష్టం చేశారు.