గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి నాణ్యతా ప్రమా్యాలతో పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.