జంగాలపల్లి లో 633 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ
రిపోర్టర్: T. SRAVAN
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా జంగాలపల్లిలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దంపతులు 633 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను అందుకొని ఆనందం వ్యక్తం చేశారు.