తుపాను నష్టాలపై గర్జించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సత్తుపల్లి

మురసు తుపాను ధాటికి నీట మునిగిన పంట పొలాలు మరియు తెగిన చెరువు కట్టలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బేతుపల్లి, దమ్మపేట మండలాల్లోని వాగులు, చెరువుల గండ్లపై ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో మంత్రి సమీక్షించారు. నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కఠినంగా ఆదేశించారు.