అర్నబ్ తుపాను బీభత్సం: శ్రీకాకుళం జిల్లాలో పదహారు వేల ఎకరాల్లో పంట నష్టం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Srikakulam
అర్నబ్ తుపాను శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు నదులకు వరద పోటెత్తింది. వరి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.