దిల్జిత్ దోసాంజ్ లైవ్ కాన్సర్ట్ పై ఇండోర్ అధికారుల కఠిన ఆంక్షలు

రిపోర్టర్: హరి స్థలం: ఇండోర్

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నవంబర్ పదిహేనవ తేదీన జరగనున్న ప్రసిద్ధ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ లైవ్ కాన్సర్ట్ లో నాలుగు వివాదాస్పద పాటలను పాడకుండా నిర్వాహకులను మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. చిన్న పిల్లలపై చెడు ప్రభావం చూపుతాయనే కారణంతో పటియాలా పెగ్ సహా నాలుగు పాటలను నిలిపివేయాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్పష్టం చేశారు.