సినిమా అప్డేట్: కల్ట్ విలన్ వివేక్ చేపూరి హీరోగా టాలీవుడ్ ఎంట్రీ
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ చిత్రంతో విలన్గా ప్రేక్షకులను భయపెట్టిన వివేక్ చేపూరి ఇప్పుడు హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. టి. శరత్ చంద్ర దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్ లో రూపొందుతున్న ఈ ద్విభాష చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో నటుడిగా తన మార్క్ చూపించిన వివేక్, త్వరలోనే గ్లింప్స్ మరియు టీజర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.