జపాన్ లో భారత క్రీడాకారుల వసతి సమస్యలపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య దృష్టి
రిపోర్టర్: నరేష్
స్థలం: World
జపాన్ లోని నగోయాలో జరుగుతున్న టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లిన భారత క్రీడాకారులు వసతి, రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య రంగంలోకి దిగారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు స్థానిక ప్రవాస భారతీయుల సహాయాన్ని మంత్రి కోరారు.