నెల్లూరులో పెన్నా ఇసుక అక్రమ తవ్వకాల మాఫియా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాజుపాలెం సమీపంలోని పెన్నా నదిలో ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనలను తుంగలో తొక్కి భారీ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. డీసిల్టేషన్ పేరుతో అనుమతులు పొంది, 11 నెలల్లో రూ.50 కోట్ల విలువైన ఇసుకను దోచుకుంటూ ప్రభుత్వానికి కేవలం 135 టన్నులే చూపడం విస్మయకరమౌతోంది. వెంకటగిరికి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి భార్య ఈ దందా వెనుక ఉండి రాత్రింబవళ్లు చెన్నైకి ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.