ఎండ తీవ్రతకు ఉపశమనం కలిగిస్తూ వర్షం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలో గురువారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఉక్కపోతకు గురైన స్థానిక ప్రజలకు ఈ వర్షంతో మంచి ఉపశమనం లభించింది. చల్లగాలులతో కూడిన ఈ వర్షం కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వారు దుకాణాల వద్ద తలదాచుకున్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.