అన్నదాతలకు తీపి కబురు: ప్రతి రైతు ఖాతాలో ఐదు వేలు జమ
రిపోర్టర్: హరి
స్థలం: మహారాష్ట్ర
ఎల్ నినో కరువు పరిస్థితులతో అల్లాడుతున్న మహారాష్ట్ర రైతులకు దీపావళి కానుకగా ప్రతి అర్హులైన అన్నదాత ఖాతాలో నేరుగా ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని ముప్పై నాలుగు జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాల రైతులకు ఈ సాయం అందనుందని, పంట రుణాల రికవరీని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు విద్యుత్ బిల్లుల రాయితీలు కల్పిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.