ఆదర్శ కుటుంబం ఘన విజయం: వెంకటేష్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47 చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిందని, ఈ సినిమాను అదరిస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపిందని కథానాయకుడు వెంకటేష్ వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మంచి సినిమాలు అందించడమే తన లక్ష్యమని, టీమంతా నిజాయతీగా పనిచేశామని పేర్కొన్నారు.