ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర మరికాసేపట్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. విగ్రహాన్ని టస్కర్ వాహనంపైకి చేర్చి నిమజ్జన వేడుకలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఈ మహా శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నగరంలో పండుగ వాతావరణం నెలకొనగా, భక్తుల సందడితో ఖైరతాబాద్ ప్రాంతం కిక్కిరిసిపోతోంది.