ట్యాంకర్లతో వరిపంటకు నీరు.. యాదాద్రిలో రైతు ఆవేదన

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం తిమ్మాపురం గ్రామంలో బోరుబావుల్లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడంతో పాటు విద్యుత్ కోతలు, లోవోల్టేజ్ సమస్యలు రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. చేతికొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు, రైతు తుమ్మల మహేందర్ రెడ్డి రోజుకు 40 నుండి 50 ట్యాంకర్ల నీటిని ఖర్చు చేసి పంటకు పారిస్తున్నారు.

వర్షాలు లేకపోవడం, బోర్లు సరిగా పనిచేయకపోవడంతో పంటకు సరిపడా నీరు అందించలేకపోతున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వేల రూపాయలు ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా నీరు పట్టిస్తున్నప్పటికీ పంటను రక్షించుకోవడం కష్టంగా మారిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయన వాపోయారు.