అంకిత భండారీ తల్లిదండ్రుల అల్టిమేటం: గవర్నర్ నియామకం రద్దు చేయాలని డిమాండ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

ఉత్తరాఖండ్లో సంచలనం సృష్టించిన అంకిత భండారీ హత్య కేసుకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు ప్రభుత్వానికి ఇరవై నాలుగు గంటల గడువు విధించారు. సిక్కిం గవర్నర్గా దుశ్యంత్ కుమార్ గౌతమ్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అర్ధరాత్రి అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు మీడియా వెల్లడించింది.