ఉద్యోగ ఆఫర్లను వెనక్కి తీసుకున్న ఇరవై రెండు కంపెనీలపై ఐఐటీల నిషేధం

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగ ఆఫర్లను అకారణంగా వెనక్కి తీసుకున్న ఇరవై రెండు కంపెనీలపై ఆల్ ఇండియా ఐఐటీ ప్లేస్మెంట్ కమిటీ కఠిన చర్యలు తీసుకుంది. ఒరాకిల్తో సహా ఈ కంపెనీలను వచ్చే రెండు సీజన్ల పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ నుంచి నిషేధించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. పలువురు విద్యార్థుల భవిష్యత్తుతో కార్పొరేట్ సంస్థలు చెలగాటమాడుతున్నాయని, ఈ నిర్ణయం వారిని రక్షించడానికి దోహదపడుతుందని విద్యార్థి సంఘాలు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.