వైద్య విద్య ప్రవేశాలు: మహారాష్ట్రలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ పూర్తి

రిపోర్టర్: రాము స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కౌన్సెలింగ్ ముగిసినట్లు మహారాష్ట్ర స్టేట్ సీఈటీ సెల్ అధికారులు వెల్లడించారు. మొత్తం 11,431 సీట్లకు గాను 10,395 సీట్లు భర్తీ అయ్యాయని, 90.93 శాతం ప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి ఆన్లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ షెడ్యూల్ విడుదల చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.