మున్సిపల్ ఎన్నికల లెక్కింపు: పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ స్పష్టమైన ఆధిపత్యం
రిపోర్టర్: రాము
స్థలం: విశాఖపట్నం
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు తొంబై తొమ్మిది శాతం మున్సిపాలిటీల్ లో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లు తమ వెంటే నిలిచాయని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం, తిరుపతి వంటి కీలక నగర పాలక సంస్థల పరిధిలోనూ తెలుగుదేశం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.