తెలంగాణ పోలీస్ అకాడమీని సందర్శించిన కర్ణాటక ఇంటెలిజెన్స్ ఎస్పీ డెక్కా కిషోర్ బాబు

రిపోర్టర్: సతీష్ స్థలం: గండిపేట

కర్ణాటక రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ డెక్కా కిషోర్ బాబు బుధవారం గండిపేటలోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీని సందర్శించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల పోలీస్ శిక్షణా సంస్థల్ లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, ఆధునిక పద్ధతులపై అధికారులు అభిప్రాయాలు పంచుకున్నారు. శిక్షణా విభాగాలు, క్రీడా సముదాయం, మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.