రైల్వే నష్టపరిహార నిబంధనలను తప్పుబట్టిన అలహాబాద్ హైకోర్టు

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

రైల్వే ప్రమాదాల బాధితులకు చెల్లించే నష్టపరిహారంలో 90 శాతం మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉంచాలన్న నిబంధనను అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది. అక్షరాస్యత లేదా ఆర్థిక పరిస్థితి ఆధారంగా పరిహారంలో కోత పెట్టడం ఆర్టికల్ 14 ఉల్లంఘన కిందకు వస్తుందని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ స్పష్టం చేశారు. పూర్తి పరిహారాన్ని బాధితులకు వెంటనే విడుదల చేయాలని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆదేశిస్తూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.