మున్సిపల్ విజయం సంబరాలకు కాదు సేవకేనని తేల్చిచెప్పిన మంత్రి నారా లోకేశ్

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, ఈ విజయం సంబరాలకు కాదని ప్రజలకు సేవ చేసేందుకు దక్కిన అవకాశమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, అహంకారానికి తావులేకుండా బాధ్యతతో పనిచేస్తామని ఆయన తెలిపారు. గడచిన రెండున్నరేళ్ల సుపరిపాలన చూసే ప్రజలు ఈ ఘనమైన ఆశీర్వాదాలు అందించారని, విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.