ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని సీపీ గర్జన

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.