నాణ్యమైన విద్యుత్ సరఫరా కోరుతూ సుల్తానాబాద్ సబ్ స్టేషన్ వద్ద ఈటల రాజేందర్ ఆందోళన
రిపోర్టర్: సతీష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో రైతుల పంటలు ఎండిపోతున్నాయని, నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక మోటర్లు కాలిపోతున్నాయని పేర్కొంటూ ఈటల రాజేందర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసనలో ఆయన పాల్గొని సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు బరిగీసి కోట్లాడాలని, రాజీపడి బతకాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.