ఎవరికీ భయపడను, అభివృద్ధిని ఆపలేరు: సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ చంచల్‌గూడలో స్టీల్ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాజకీయంగా తనను ఎవరూ బెదిరించలేరని, తాను ఎవరికీ బానిసను కాదని స్పష్టం చేశారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల సంక్షేమం, నగర అభివృద్ధి పనులను ఆపే ప్రసక్తే లేదని, లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ఆయన గట్టిగా ప్రకటించారు.