ఢిల్లీలో తీవ్ర కాలుష్యం: మొదటి విడత గ్రాప్ ఆంక్షలు అమలు

రిపోర్టర్: రాము స్థలం: ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గాలి నాణ్యత పడిపోవడంతో కాలుష్య నియంత్రణ కమిషన్ తొలి విడత గ్రాప్ ఆంక్షలను అమల్లోకి తెచ్చినట్లు పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకుల్లో పీయూసీ లేని వాహనాలకు ఇంధన విక్రయాలు నిలిపివేయడంతో పాటు పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయనున్నట్లు ఆయన తెలిపారు.