వంగపల్లిలో దేశ సమగ్రతకు ప్రతీక ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో భారత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ఐక్యత కోసం ఆమె చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని డీసీసీ జనరల్ సెక్రటరీ కానుగు బాలరాజు గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.