పశ్చిమ బెంగాల్లో నదిలో కొట్టుకుపోయిన ఏనుగు గున్న రక్షణ
రిపోర్టర్: విజయ్
స్థలం: West Bengal
పశ్చిమ బెంగాల్లోని బైకుంఠపూర్ అటవీ డివిజన్ పరిధిలో నది ఉధృతికి కొట్టుకుపోయిన నాలుగు రోజుల ఏనుగు గున్నను స్థానిక మత్స్యకారులు, అటవీశాఖ అధికారులు సాహసంగా కాపాడారు. తీస్తా నదిని దాటుతుండగా గుంపు నుంచి విడిపోయిన ఆ గున్న నాలుగు కిలోమీటర్లు కొట్టుకుపోయి బ్యారేజ్ వద్ద నీట మునుగుతుండగా మత్స్యకారులు బాబుల్ దాస్, మిథున్ దాస్, ఖాదర్ దాస్, విశ్వనాథ్, గోపాల్ తమ పడవతో రక్షించారు. అనంతరం అటవీశాఖ అధికారుల సహకారంతో రెండు గంటల పాటు శ్రమించి ఆ గున్నను దాని తల్లి వద్దకు చేర్చడంతో ఈ అద్భుతమైన ఘటన నెట్టింట వైరల్ అయింది.