ఎన్బీకే 112 మ్యూజిక్ డైరెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్బీకే 112 సినిమా సంగీత దర్శకుడి ఎంపికపై వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. అనిరుధ్ రవిచందర్ లేదా జీవీ ప్రకాష్ కుమార్లను ఇప్పటివరకు అధికారికంగా ఖరారు చేయలేదని మేకర్స్ వెల్లడించారు. పలువురు సంగీత దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తేల్చిచెప్పింది.