రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: రాము
స్థలం: శ్రీకాకుళం
చేయని నేరానికి జైలుకు పంపారంటూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన వైకాపా సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నానని విర్రవీగుతున్న వారిని పలాసకు తీసుకొచ్చి కూర్చోబెట్టే పరిస్థితి కల్పిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు.