మర్రిపాడులో మేకపాటి దంపతుల ఆధ్వర్యంలో శ్రీవారి పండుగ వేడుకలు
రిపోర్టర్: Darsigunta Naveen
స్థలం: మర్రిపాడు
మర్రిపాడు మండలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించి 16 రోజులు పూర్తయిన సందర్భంగా మేకపాటి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శాంతికుమారి పాల్గొని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.