వినాయక ఉత్సవాల్లో విద్యార్థులను ఉత్సాహపరిచిన క్విజ్ పోటీలు

రిపోర్టర్: Pydi. Suryanarayana స్థలం: ఆమదాలవలస

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామంలో బిపివై యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఇక్కడ దసరా ఉత్సవాల్లో పోటీలు నిర్వహించే ఆనవాయితీ ఉంది. ఈ స్ఫూర్తితోనే బొడ్డేపల్లి రవికుమార్ సహకారంతో గత రెండు సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలలోనూ ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని ఉత్సాహంగా విజేతలను అభినందించారు.