యువ పారిశ్రామికవేత్తలకు గొప్ప అవకాశం: తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ ప్రారంభం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సామాజిక సమస్యలకు ఆధునిక సాంకేతిక పరిష్కారాలు కనుగొనే లక్ష్యంతో తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టినట్లు అధికారులు వెల్లడించారు. సమాజానికి ఉపయోగపడే వినూత్న ఆలోచనలు కలిగిన స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తల నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, విద్య, రహదారుల నిర్మాణం వంటి కీలక రంగాల్ లోని సమస్యలపై వస్తున్న ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా అమలు చేసి ప్రభుత్వ శాఖలతో వ్యాపార అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.