దేవరకద్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుల ఇసుక దందా భగ్నం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Mahabubnagar

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సోదరుడు, అనుచరులు సాగిస్తున్న అక్రమ ఇసుక రవాణాను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఊకచెట్టు వాగులో ఎలాంటి అనుమతులు లేకుండా అధికారుల అండతో అడ్డగోలుగా ఇసుక తవ్వుతూ తరలిస్తుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, ఇసుక దందాను నిర్ద్వంద్వంగా నిలదీసి అడ్డుకున్నారు.